ఏపీ టార్గెట్: ఒక్కరోజే 10 లక్షల మందికి కరోనా టీకా!
- మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన సర్కార్
- కృష్ణా, గుంటూరు, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు లక్ష చొప్పున డోసులు
- మిగతా వాటికి 50 వేల చొప్పున పంపిన ఆరోగ్య శాఖ
వారితో పాటు వ్యాక్సిన్ వేసుకోని ఐదేళ్ల లోపు పిల్లలు కలిగి ఉన్న తల్లులకు వీలైనంత ఎక్కువ మందికి టీకా వేయాలని సర్కారు నిర్ణయించింది. మొత్తం 18 లక్షల మంది తల్లులుండగా.. ఇప్పటిదాకా వారిలో 28 శాతం మంది మొదటి డోసు టీకా తీసుకున్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఇతరులకూ వ్యాక్సిన్ వేయనున్నారు. రెండో డోసు పెండింగ్ ఉన్న వారికీ టీకా ఇవ్వడానికి ప్రయత్నిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.