తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం.. ఏపీతో తాడోపేడో తేల్చుకోవాలని కేబినెట్ నిర్ణయం
- కేంద్రం, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను ఏపీ బేఖాతరు చేస్తోంది
- ఏపీ తీరుపై న్యాయస్థానాలను ఆశ్రయించాలని నిర్ణయం
- ప్రధాని, కేంద్ర జలశక్తి మంత్రికి వినతిపత్రాలు
- తెలంగాణ వాటా కోసం కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయం
ప్రధానమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి వినతిపత్రాలు సమర్పించనుంది. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలుపుదల చేయించాలని కోరాలని నిర్ణయించింది. ఏపీ ప్రాజెక్టుల కారణంగా హైదరాబాద్‌కు తాగునీరుతోపాటు పలు జిల్లాలకు సాగునీరు విషయంలో అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడిన కేబినెట్.. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడి ఏడు సంవత్సరాలు అయినా కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా నిర్ధారణ కాకపోవడంపై కేబినెట్ ఆవేదన వ్యక్తం చేసింది.