తెలంగాణలో తాజాగా 1,417 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 1,24,430 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 149 కొత్త కేసులు
- అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో ఇద్దరికి పాజిటివ్
- రాష్ట్రంలో 12 మరణాలు
అదే సమయంలో 1,897 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం 3,546 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,10,834 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,88,259 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,029 చికిత్స పొందుతున్నారు.
