తెలంగాణలో గత 24 గంటల్లో 1,489 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు
- తాజాగా 1,16,252 కరోనా టెస్టులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 175 కొత్త కేసులు
- నిర్మల్ జిల్లాలో 2 కేసుల నమోదు
- ఇంకా 19,975 మందికి చికిత్స
అదే సమయంలో 1,436 మంది కరోనా నుంచి కోలుకోగా, 11 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,07,925 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,84,429 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,975 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,521కి పెరిగింది. కరోనా మరణాల శాతం జాతీయస్థాయిలో 1.3 కాగా, తెలంగాణలో అది 0.57 శాతానికి తగ్గింది.
