రెండో దశ కరోనా ఉద్ధృతిలో 730 మంది వైద్యుల మృత్యువాత
- వెల్లడించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్
- అత్యధికంగా బీహార్‌లో 115 మంది మరణం
- ఢిల్లీలో 109 మంది మృత్యువాత
- ఏపీలో 70, తెలంగాణలో 12 మంది మరణం
అత్యధికంగా బీహార్‌లో 115 మంది వైద్యులు మరణించారు. ఢిల్లీలో 109 మంది మృత్యువాతపడ్డారు. తమిళనాడులో 91 మంది, మహారాష్ట్రలో 81 మంది, పశ్చిమ బెంగాల్లో 71, ఆంధ్రప్రదేశ్‌లో 70, తెలంగాణలో 12 మంది మరణించారు. ఐఎంఏ కొవిడ్ రిజిస్ట్రీ వివరాల ప్రకారం.. తొలి దశ కరోనా వ్యాప్తి సమయంలో 748 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.