Tamannaah: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • టీవీకి కూడా వస్తున్న తమన్నా
  • మరొకటి ప్లాన్ చేస్తున్న దిల్ రాజు  
  • 'జాతిరత్నాలు' భామకు మరో ఆఫర్     
Tamanna to host a TV programme

*  అటు సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తున్న కథానాయిక తమన్నా త్వరలో ఓ టీవీ షోని ప్రెజెంట్ చేయనుంది. జెమినీ టీవీ రూపొందిస్తున్న 'మాస్టర్ చెఫ్' కార్యక్రమానికి ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది.
*  ప్రస్తుతం చరణ్-శంకర్ కలయికలో ఒక చిత్రం, విజయ్-వంశీ పైడిపల్లి కాంబోలో మరో చిత్రాన్ని నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. మరోపక్క ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మరో చిత్రాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. అలాగే, బోయపాటి-సూర్య కలయికలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి కూడా ఆయన ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారట.
*  ఇటీవల వచ్చిన 'జాతిరత్నాలు' చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన కథానాయిక ఫరీయా అబ్దుల్లాకు తెలుగులో మరో ఛాన్స్ వచ్చింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు నటిస్తున్న 'ఢీ' సీక్వెల్ 'డి&డి' చిత్రంలో ఆమెకు ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, అది కథానాయిక పాత్రా? లేక ప్రత్యేక పాత్రా? అన్నది వెల్లడికాలేదు.

More Telugu News