తెలంగాణలో 96 శాతానికి పెరిగిన కరోనా రికవరీ రేటు
- ఇప్పటివరకు 6.04 లక్షల కరోనా కేసుల నమోదు
- 5.80 లక్షల మందికి కరోనా నయం
- ఇంకా 20,461 మందికి చికిత్స
- తాజాగా 1,511 పాజిటివ్ కేసులు
అదే సమయంలో రాష్ట్రంలో 12 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,496కి పెరిగింది. అటు, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,04,880కి చేరింది. ఇప్పటిదాకా 5,80,923 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,461 మందికి చికిత్స జరుగుతోంది.
