వరుసగా ఐదో రోజు సీఎం జగన్‌కు రఘురామ లేఖ!
- అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి
- రూ.1,100 కోట్లు వెంటనే విడుదల చేయాలి
- బాధితుల్లో ఎక్కువగా రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులే
- హామీని అమలు చేయాలి
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.1,100 కోట్లను వెంటనే విడుదల చేయాలని రఘురామ ఆ లేఖ ద్వారా కోరారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
అగ్రిగోల్డ్ బాధితుల్లో ఎక్కువగా రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 80 శాతం మంది బాధితులను ఆదుకునేందుకు రూ.1,100 కోట్లు విడుదల చేస్తామని జగన్ అప్పట్లో చెప్పారని ఆయన గుర్తు చేశారు.