కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్యల కేసులో ఎన్ఐఏ అదనపు చార్జ్‌షీట్
- కిడారి, సోమ హత్యల కేసులో కళావతిదే కీలక పాత్ర
- హత్య చేసిన బృందానికి అన్నీ సమకూర్చింది ఆమెనే
- అనుబంధ చార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ
హత్యలు జరగడానికి రెండు వారాల ముందే కళావతి, ఆమె భర్త, మావోయిస్టు పార్టీ జోనల్ కమిటీ సభ్యుడైన కాకూరి పండన్నతోపాటు మరో 40 మంది డుంబ్రిగూడలో మకాం వేశారని ఎన్ఐఏ తన అభియోగపత్రంలో పేర్కొంది. కిడారి, సోమలను హత్యలు చేసే బృందానికి అవసరమైన వనరులు, ఇతర సరంజామాను ఆమె అందించినట్టు పేర్కొంది. కళావతి రెండు దశాబ్దాల క్రితమే మావోయిస్టు పార్టీలో చేరిందని ఎన్ఐఏ తన చార్జ్‌షీట్‌లో వివరించింది.