షెడ్యూల్ ప్రకారమే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు!
- జులైలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- ఆటంకాలు ఉండబోవని పార్లమెంటు వర్గాల ధీమా
- టీకాలు తీసుకున్న ఎంపీలు, ఇతర సిబ్బంది
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో గతేడాది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సెప్టెంబరులో జరిగాయి. కరోనాను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల కాలాన్ని మూడుసార్లు తగ్గించింది. కాగా, ఈసారి వర్షాకాల సమావేశాలకు పెద్దగా ఆటంకాలు ఉండబోవని, ఎందుకంటే, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఇతర సిబ్బంది కనీసం ఒక కరోనా వ్యాక్సిన్ డోసైనా తీసుకున్నారని పార్లమెంటు అధికార వర్గాలంటున్నాయి.