పూరితో పవన్ సినిమా ఉన్నట్టే!
- గతంలో వచ్చిన 'బద్రి' సూపర్ హిట్
- నిరాశపరిచిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు'
- మూడో సినిమాకి మొదలైన ప్రయత్నాలు
అయితే ఇది 'జన గణ మన' కథ కాదనే టాక్ తాజాగా వినిపిస్తోంది. పవన్ కోసం పూరి కొత్త లైన్ అనుకున్నాడనీ, ఆ లైన్ పైనే స్క్రిప్ట్ వర్క్ జరగనుందని అంటున్నారు. ప్రస్తుతం పవన్ వరుసగా భారీ ప్రాజెక్టులను ఒప్పుకుని ఉన్నారు. అందువలన పూరి ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనేది చెప్పడం కష్టం. ఎంత ఆలస్యమైనా ఈ కాంబినేషన్లో ప్రాజెక్టు అయితే ఉందనేది వాస్తవం అనే చెప్పుకుంటున్నారు. మరి పవన్ కోసం పూరి రెడీ చేసిన ఆ లైన్ ఏమిటో .. ఆయన పవన్ ను ఈ సారి ఎలా చూపించనున్నాడో అనేది ఆసక్తికరంగా మారింది.