'అన్న వైఎస్సార్ పార్టీ' పిటిషన్ ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

YSRCP recognition will continue says Delhi High Court
  • వైఎస్సార్ పదం తమకే చెల్లుతుందన్న అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
  • పిటిషన్ లో మెరిట్ లేదన్న ఢిల్లీ హైకోర్టు
  • ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కూడా తీసుకున్నామని వ్యాఖ్య
  • వైఎస్సార్సీపీకి ఉన్న గుర్తింపు కొనసాగుతుందని తీర్పు 
వైఎస్సార్సీపీకి ఉన్న గుర్తింపు ఇకపై కూడా కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. వైఎస్సార్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది. వైఎస్సార్ అనే పదం తమకే చెందుతుందంటూ 'అన్న వైఎస్సార్ పార్టీ' పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

తప్పుడు ఉద్దేశాలతో కేసు వేశారని, పిటిషన్ కు ఎలాంటి మెరిట్ లేదని పేర్కొంటూ, అన్న వైఎస్సార్ పార్టీ వేసిన పిటిషన్ ను ఈ సందర్భంగా కోర్టు కొట్టి వేసింది. వైఎస్సార్సీపీ గుర్తింపు ఇకపై కూడా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ  మేరకు జస్టిస్ ప్రతీక్ జైన్ సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును వెలువరించింది.

వైఎస్సార్సీపీ అనేది అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమని ఆ పార్టీ తన పిటిషన్ లో పేర్కొంది. తమ పార్టీ పేరు వైసీపీ వాడుకుంటోందని వాదించింది. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ... ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కూడా తాము తీసుకున్నామని... పిటిషనర్ వాదనలో మెరిట్ లేదని వెల్లడించింది.
Go Back to Shorts
YSRCP
Delhi High Court

More Telugu News