తిరుమల గిరులే హనుమంతుడి జన్మస్థలంగా ప్రకటించిన తర్వాత తొలిసారి అంజనాద్రిపై జయంతి వేడుకలు
- జూన్ 4న హనుమాన్ జయంతి
- 5 రోజుల పాటు జరపాలని టీటీడీ నిర్ణయం
- రోజుకో రకం పుష్పాలతో స్వామివారికి అభిషేకం, అర్చన
- కొవిడ్ నిబంధనలతో భక్తులకు అనుమతి
ఈ నెల 4న హనుమాన్ జయంతి కాగా, అంజనాద్రి పర్వతంపై కన్నులపండువగా వేడుకలు జరపాలని నిశ్చయించింది. ఈ నెల 4వ తేదీ నుంచి 5 రోజుల పాటు రోజుకో రకం పుష్పాలతో స్వామివారికి అభిషేకాదులు జరపనున్నారు. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ భక్తులను ఈ ఉత్సవాలకు అనుమతిస్తారు. అంజనాద్రి పర్వతమే వాయుపుత్రుడి జన్మస్థలం అని ప్రకటించిన తర్వాత ఇక్కడ చేస్తున్న తొలి జయంతి ఉత్సవాలు కావడంతో టీటీడీ వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.