కేంద్రంపై మరోమారు విరుచుకుపడిన మమత
- డిసెంబరు నాటికి దేశం మొత్తానికి వ్యాక్సిన్లు ఇస్తామన్న కేంద్రం ప్రకటనపై ఎద్దేవా
- తొలుత రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వాలని డిమాండ్
- రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఇంకా 1.64 కోట్ల డోసులు ఉన్నాయన్న కేంద్రం
మరోవైపు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేడు మాట్లాడుతూ.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం 1.64 కోట్ల కరోనా వైరస్ డోసుల నిల్వలు ఉన్నాయని చెప్పడం గమనార్హం. కేంద్రం ఇప్పటి వరకు ఉచితంగా, ప్రత్యక్ష సేకరణ ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 23 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులను అందించినట్టు తెలిపింది. నిరుపయోగంగా మారిన వాటితో కలుపుకుని ఇప్పటి వరకు 21,71,44,022 డోసులు వినియోగించినట్టు వివరించింది. ఇంకా, 1,64,42,938 వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో ఉన్నట్టు తెలిపింది.