Mehul Choksi: మే 25 కాదు.. అంతకన్నా ముందే డొమినికాకు వెళ్లిన మెహుల్​ ఛోక్సీ!

  • అక్కడి ఇమిగ్రేషన్ పేపర్లతో నిర్ధారణ
  • మే 23న ఆంటిగ్వా నుంచి డొమినికాకు
  • పోలీసులు, రాజకీయ నాయకులు సహకరించారని ఆరోపణలు
Documents show Mehul Choksi arrived in Dominica earlier than claimed

అనుకున్న దానికన్నా ముందే మెహుల్ ఛోక్సీ డొమినికాకు వెళ్లినట్టు తెలుస్తోంది. గర్ల్ ఫ్రెండ్ తో కలిసి అతడు మే 25న డొమినికా వెళ్లాడని ముందు అనుకున్నా.. మే 23నే అక్కడకు వెళ్లాడని అక్కడి కస్టమ్స్ డాక్యుమెంట్ల ఆధారంగా తెలుస్తోంది. వాస్తవానికి మే 23న ఉదయం 10.09 గంటలకు అతడి యాట్ ఆంటిగ్వా బార్బుడా నుంచి బయల్దేరిందని, మే 25న డొమినికాకు చేరినా కస్టమ్స్ అధికారులు తిరస్కరించారని అంతకుముందు ఆంటిగ్వా అధికారులు చెప్పారు.

అయితే, మే 23న ఆంటిగ్వా నుంచి బయల్దేరిన మెహుల్ ఛోక్సీ నేరుగా 120 మైళ్ల దూరంలోని డొమినికాకు చేరాడని ఆంటిగ్వా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారుల డాక్యుమెంట్స్ చెబుతున్నాయి. అదే రోజు సాయంత్రానికి ఛోక్సీ డొమినికా వెళ్లాడని అంటున్నాయి. అంతేకాదు.. డొమినికా ఇమిగ్రేషన్ పేపర్లూ ఇదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి.

ఛోక్సీ డొమినికా చేరుకోవడంలో అక్కడి పోలీసులు, రాజకీయ నాయకులు సాయం చేశారని డొమినికా ప్రతిపక్ష నేత ఆరోపించిన సంగతి తెలిసిందే.  కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగవేసిన కేసులో నిందితుడైన ఛోక్సీ భారత్ వదిలి పారిపోయాడు.

More Telugu News