'బింబిసార'... కల్యాణ్ రామ్ నుంచి చారిత్రక చిత్రం... మోషన్ పోస్టర్ ఇదిగో!
- నేడు ఎన్టీఆర్ జయంతి
- కల్యాణ్ రామ్ కొత్త చిత్రం టైటిల్ విడుదల
- మోషన్ పోస్టర్ లింకును పంచుకున్న చిత్రయూనిట్
- వశిష్ఠ దర్శకత్వంలో బింబిసార
- కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్
ఈ చిత్రానికి వశిష్ఠ (నిర్మాత మల్లిడి సత్యనారాయణరెడ్డి తనయుడు) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ చిత్రబృందం మోషన్ పోస్టర్ లింకును పంచుకుంది. ఇందులో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్ కనిపించనున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.