రష్యా నుంచి హైదరాబాద్ చేరుకున్న 1.50 లక్షల డోసుల స్పుత్నిక్-వీ వ్యాక్సిన్
- ఇటీవల ఫస్ట్‌బ్యాచ్ దిగుమతి
- ఇప్పుడు రెండో బ్యాచ్
- రెడ్డీస్ ల్యాబ్‌కు తరలింపు
- దేశానికి రష్యా నుంచి రావాల్సిన డోసులు మొత్తం 67 లక్షలు
మొత్తం 1.50 లక్షల డోసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. అక్కడికి నుంచి వీటిని రెడ్డీస్ ల్యాబ్‌కు తరలించారు. దేశానికి రష్యా నుంచి మొత్తం 67 లక్షల డోసులు చేరుకోనున్నాయి. వాటిల్లో భాగంగానే విడతల వారీగా స్పుత్నిక్-వీ వస్తోంది. అంతేగాక, వచ్చే నెల నుంచి దేశంలోనే స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లను రెడ్డీస్ ల్యాబ్ ఉత్పత్తి చేయనుంది.
స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ ఒక్కో డోస్ ధర రూ.995గా ఉంటుంది. దేశంలో ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమయ్యాక దాని ధర తగ్గనుంది.