సొంత రాష్ట్రాలకు తరలిపోతున్న వలస కార్మికులు.. సికింద్రాబాద్-దానాపూర్ రైలు టికెట్లు గంటలోనే ఖాళీ
- మూడు రైళ్లూ ఫుల్
- ఇంకా 541 మందికి వెయిటింగ్ లిస్టులోనే
- లాక్‌డౌన్ పొడిగింపుపై ఊహాగానాలతో నగరాన్ని వీడుతున్న వలస కార్మికులు
- యూపీ, బీహార్, బెంగాల్, ఒడిశా వైపు వెళ్లే రైళ్లన్నీ ఫుల్
తెలంగాణలో ప్రస్తుతం పది రోజులపాటు అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను మళ్లీ పొడిగిస్తారన్న వార్తలకు తోడు, ఉపాధి కరువవడంతో కార్మికులు సొంత రాష్ట్రాలకు తరలివెళ్లిపోతున్నారు. ఫలితంగా బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వైపు వెళ్లే రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. వారం, పది రోజుల ముందే టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ దొరకడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.