నిన్న కూడా జగన్ మాస్క్ పెట్టుకోలేదు.. స్టాలిన్ ను చూసి జగన్ నేర్చుకోవాలి: అచ్చెన్నాయుడు
- కరోనాతో 10 వేల మంది చనిపోతే జగన్ ఏం చేస్తున్నారు?
- అందరూ మాస్క్ పెట్టుకుంటుంటే.. జగన్ ఎందుకు పెట్టుకోవడం లేదు?
- స్టాలిన్ కు ఉన్న బాధ్యత జగన్ కు లేదా?
తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు ఎందరో అక్కడి సీఎం స్టాలిన్ కు చెక్కులు అందించడానికి వెళ్తే ఆయన మాస్కులు పెట్టుకున్నారని... స్టాలిన్ మాస్కులు పెట్టుకుని ఎంతో బాధ్యతగా వ్యవహరించారని అచ్చెన్న కితాబునిచ్చారు. స్టాలిన్ కు ఉన్న బాధ్యత జగన్ కు లేదా? అని ప్రశ్నించారు. పేదల కడుపు నింపేందుకు రూ. 5కే తమ టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు పెట్టిందని... జగన్ సీఎం అయిన తర్వాత వాటిని ఎత్తేసి పేదలు పస్తులతో పడుకునేలా చేశాడని మండిపడ్డారు. వైయస్సార్ పేరు మీదైనా ఆ క్యాంటీన్లు కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలో విధ్వంసం తప్ప మరేమీ లేదని విమర్శించారు.