కానిస్టేబుల్‌తో కలిసి ఆత్మహత్యకు యత్నించిన చుండూరు ఎస్ఐ శ్రావణి మృతి
- గతేడాది అక్టోబరులో చుండూరు ఎస్ఐగా శ్రావణి బాధ్యతలు
- కానిస్టేబుల్ రవీంద్రతో కలిసి గత శనివారం ఆత్మహత్యాయత్నం
- రవీంద్రకు కొనసాగుతున్న చికిత్స
ఈ క్రమంలో గత శనివారం ఇద్దరూ కలసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అనంతరం వారిద్దరూ స్వయంగా కారులో వెళ్లి తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని వేర్వేరు ఆసుపత్రులకు వారిని తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న శ్రావణి పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున మృతి చెందారు. కానిస్టేబుల్ రవీంద్రకు చికిత్స కొనసాగుతోంది.