ఇక నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చారు: ఈటల వ్యాఖ్యలు
- నాకు కొన్ని వేల ఫోను కాల్స్ వచ్చాయి
- నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారి అభిప్రాయాలను తీసుకున్నా
- కొందరు 20 ఏళ్ల ఉద్యమ ఘట్టాలను గుర్తు చేశారు
- నాకు ఇప్పుడు జరిగిన అన్యాయం భరించరానిదని అభిప్రాయపడ్డారు
'చాలా మంది శ్రేయోభిలాషులు అమెరికాతో పాటు పలు దేశాల నుంచి కూడా ఫోను చేస్తున్నారు. నాకు కొన్ని వేల ఫోను కాల్స్ వచ్చాయి. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారి అభిప్రాయాలను తీసుకున్నాను. కరోనా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కూడా కొందరు సలహా ఇచ్చారు. కొందరు 20 ఏళ్ల ఉద్యమ ఘట్టాలను గుర్తు చేశారు. నాకు ఇప్పుడు జరిగిన అన్యాయం భరించరానిదని కొందరు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు' అని చెప్పారు.
'నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారో.. వారు ఏం ఆశించారో వారి కల నెరవేరాక వారికి ఏం జరుగుతోందో మీకు తెలుసు. అన్నింటి కంటే ముఖ్యంగా ఆత్మగౌరవ సమస్య ఏర్పడింది' అని ఈటల అన్నారు.
'తెలంగాణలో చాలా ఘోరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. నాకు సంబంధించి ఏదైనా సమస్య తలెత్తితే నేనే నేరుగా మీడియాకు తెలుపుతాను. అంతేగానీ, ఇతరులు నా గురించి ఇచ్చే సమాచారాన్ని మాత్రం నమ్మకండి' అని ఈటల విన్నవించారు.