తెలంగాణలో నేటితో ముగియనున్న కర్ఫ్యూ.. మరికొన్ని రోజులు పొడిగించే యోచనలో ప్రభుత్వం

Night curfew will continue in Telangana
  • ఈ నెల 20 నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ
  • తగ్గుముఖం పట్టని కేసులు
  • పొడిగింపుపై నేడు ప్రకటన!
ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు విధించిన నైట్ కర్ఫ్యూను మరికొన్ని రోజులపాటు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ నెల 20న విధించిన నైట్‌ కర్ఫ్యూ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ పొడిగింపుపై నేడు ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు, తెలంగాణలో మరో రెండు మూడు రోజుల్లో లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వం కొట్టివేసింది.
Go Back to Shorts
Telangana
Night Curfew
Corona Virus

More Telugu News