తిరుమలలో 11 వేలకు పడిపోయిన భక్తుల సంఖ్య!

Very Low Rush in Tirumala
  • నిన్న 11,490 మందికి దర్శనం
  • 1.30 కోట్ల రూపాయల హుండీ ఆదాయం
  • కొత్త నిబంధనలు విధించడం లేదన్న టీటీడీ
తిరుమలలో భక్తుల సంఖ్య సాధారణ స్థాయితో పోలిస్తే గణనీయంగా తగ్గింది. గత సంవత్సరం లాక్ డౌన్ తరువాత ఆలయంలోకి తిరిగి భక్తులను అనుమతించిన వేళ, భక్తుల సంఖ్య 50 వేల వరకూ పెరుగగా, ఇప్పుడు కేసులు పెరుగుతున్న వేళ మళ్లీ భక్తుల సంఖ్య పడిపోయింది. నిన్న మంగళవారం కేవలం 11,490 మంది భక్తులు మాత్రమే స్వామిని దర్శించుకున్నారు. 5,024 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా స్వామివారికి రూ. 1.30 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

భక్తుల సంఖ్య కనిష్ఠ స్థాయిలో ఉన్నందున కొత్త కరోనా నిబంధనలను విధించడం లేదని, ఇప్పుడున్న నిబంధనలనే అమలుచేస్తున్నామని అధికారులు తెలిపారు. కేవలం ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనాన్ని కల్పిస్తున్నామన్నారు. క్యూ లైన్లలో భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ ను తప్పనిసరి చేశామని అన్నారు.
Go Back to Shorts
TTD
Tirumala
Tirupati
Piligrims

More Telugu News