Corona Virus: క‌రోనా ఆసుప‌త్రిలోనే ఉరి వేసుకుని త‌నువు చాలించిన‌ యువ‌కుడు

 man commits suicide in ap
షార్ట్స్‌లో చూడండి
క‌రోనా ఆసుప‌త్రిలోనే ఓ యువ‌కుడు ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ప్రేమించిన అమ్మాయితో గొడ‌వ‌లు ఉండ‌డం ఇదే స‌మ‌యంలో క‌రోనా కూడా సోక‌డంతో మానసికంగా కుంగిపోయి ఆ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. విశాఖపట్నంలో ఈ విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. సునీల్ అనే యువ‌కుడు మర్చంట్‌ నేవీలో సీ మెన్‌గా పనిచేస్తున్నాడు.  

కరోనా సోకడంతో కలెక్టరేట్‌ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. కొన్ని రోజులుగా సునీల్‌కు తాను ప్రేమించిన అమ్మాయి నుంచి  వేధింపులు ఎదుర‌వుతున్నాయ‌ని ఆయ‌న బంధువులు చెప్పారు. పెళ్లి చేసుకోవాలని భావించిన అమ్మాయే సునీల్‌పై కేసు పెట్టడంతో ఆయ‌న కుమిలిపోయాడ‌ని తెలిపారు. అదే సమయంలో క‌రోనా రావడంతో మ‌రింత ఒత్తిడికి గుర‌య్యాడ‌ని అంటున్నారు.

Go Back to Shorts
Corona Virus
COVID19
Vizag

More Telugu News