16 ఏళ్లు దాటిన వారికీ టీకా.. అమెరికా సీడీసీ నిర్ణయం
- ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు
- తొలుత 16 ఏళ్లు దాటి అనారోగ్య సమస్యలున్న వారికి ప్రాధాన్యం
- శరవేగంగా సాగుతున్న వ్యాక్సినేషన్
ఇలాంటి వారికి కరోనా వైరస్ సోకితే అనారోగ్య సమస్యలు మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి అలాస్కా, జార్జియా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఇప్పటికే 16 ఏళ్లు దాటిన వారికి టీకాలు వేస్తున్నారు. మరోవైపు, అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది.