భారత్‌ను ‘రెడ్ లిస్ట్’లో పెట్టిన బ్రిటన్
- కరోనా విజృంభణ నేపథ్యంలోనే
- బ్రిటన్‌లోకి అనుమతి నిరాకరణ
- మొత్తం 40 దేశాలు రెడ్ లిస్ట్‌లోకి
- భారత పర్యటన రద్దు చేసుకున్న బోరిస్ జాన్సన్
ప్రస్తుతం భారత్‌లో ప్రబలుతున్న కరోనా వేరియంట్ అత్యంత ప్రమాదరకమైందన్న అక్కడి నిపుణుల సూచన మేరకే బ్రిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్ సహా మొత్తం 40 దేశాలను బ్రిటన్ రెడ్ లిస్ట్‌లో చేర్చింది. అంతకుముందు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. కొవిడ్ విజృంభణ నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు హాంకాంగ్ సైతం భారత విమాన రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించింది.