విశాఖ జిల్లాలో ఆరుగురిని ఒకేసారి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తి!
- పెందుర్తి మండలంలో కలకలం
- పదునైన ఆయుధంతో దాడి
- ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇంట్లో నిద్రపోతున్న వారిపై ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేసి, ఒక్కొక్కరినీ హతమార్చినట్టుగా తెలుస్తోంది. ఇంట్లో మృతదేహాలు రక్తపు మడుగులో పడివుండి భీతావహంగా కనిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.