అడ్డంకులను ఎదురొడ్డి 80కి పైగా దేశాలకు టీకాలు పంపాం: మోదీ
- కరోనా అంతంలో భారత్ ముందుంటుందని హామీ
- 130 కోట్ల మందిని కాపాడుకుంటూనే ఇతర దేశాలకు సాయం
- కరోనా అంతానికి మానవాళి ఏకతాటిపైకి రావాలి
- 'రైసీనా డైలాగ్ 2021'లో ప్రధాని మోదీ
దేశంలో 130 కోట్ల మందిని రక్షించుకునేందుకు చర్యలు చేపడుతూనే ఇతర దేశాలకు సాయం అందించామని మోదీ తెలిపారు. మహమ్మారిని రూపుమాపాలంటే మానవాళి మొత్తం ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని భారత్ ముందే గుర్తించిందని తెలిపారు. దాదాపు శతాబ్ద కాలం తర్వాత ఈ ప్రపంచం ఓ మహమ్మారిని ఎదుర్కొంటోందని ప్రధాని గుర్తు చేశారు. అయితే, తాజాగా వచ్చిన కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు మాత్రం ఈ సమాజం సంసిద్ధంగా లేదని తెలిపారు. గత ఏడాది కాలంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ వర్గాల కృషి వల్ల కొన్నింటికి పరిష్కారం లభించిందన్నారు. ఇంకా అనేకం అలాగే ఉండిపోయాయన్నారు.