నాడు ధోనీపై ద్రావిడ్ కేకలేశాడు: సెహ్వాగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాడు ధోనీపై ద్రావిడ్ కేకలేశాడు: సెహ్వాగ్

Rahul Angry Over Dhoni Recalls Sehwag
  • ఎప్పుడూ కూల్ గా కనిపించే ద్రావిడ్
  • పేలవంగా ఆడి ధోనీ అవుట్ కావడంతో అగ్రహం
  • పాకిస్థాన్ సిరీస్ ను ప్రస్తావించిన సెహ్వాగ్
భారత క్రికెట్ లో మిస్టర్ డిపెండబుల్, ది వాల్ గా పేరు తెచ్చుకున్న రాహుల్ ద్రావిడ్ ఎంతో కూల్ గా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, కొన్నిసార్లు రాహుల్ కూడా తనలోని కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. అటువంటి ఓ ఘటనను డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. 2006లో పాకిస్థాన్ లో జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఆసక్తికర ఘటన గురించి చెప్పుకొచ్చాడు.

ధోనీ అప్పుడే జట్టులోకి వచ్చాడని, ఓ మ్యాచ్ లో చెత్తగా ఆడి అవుట్ అయి పెవిలియన్ కు వచ్చిన ధోనీని చూసిన ద్రావిడ్ కు చిర్రెత్తుకొచ్చి, "నువ్వు ఇలాగేనా ఆడాల్సింది. మ్యాచ్ ని నువ్వే ముగించి ఉండాల్సింది" అంటూ కోపంతో ఇంగ్లీషులో తిట్టేశాడని, ద్రావిడ్ ఇంగ్లీషులో తనకు సగం మాత్రమే అర్థమైందని సెహ్వాగ్ చెప్పాడు.

ఆ తరువాతి మ్యాచ్ లో ధోనీ భారీ షాట్లకు పోకుండా నిదానంగా ఆడుతూ ఉండటంతో, తాను ఏమైందని, ఎందుకలా ఉన్నావని అడిగానని, మరోసారి ద్రావిడ్ తో తిట్టించుకోవాలని తాను భావించడం లేదని చెప్పిన ధోనీ, తాను నిదానంగా ఆడుతూ మ్యాచ్ ని ముగించే వెళ్తానని అన్నాడని సెహ్వాగ్ వెల్లడించాడు.
MS Dhoni
Virender Sehwag
Rahul Dravid
Angry

More Telugu News