దళితులను అవమానించేలా పోస్ట్ పెట్టిన చంద్రబాబు, లోకేశ్ లను వెంటనే అరెస్ట్ చేయండి... డీజీపీని కోరిన వైసీపీ నేతలు
- తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి
- గురుమూర్తిని అవమానించేలా పోస్టు పెట్టారన్న వైసీపీ నేతలు
- చంద్రబాబు, లోకేశ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్
- డీజీపిని కలిసిన నందిగం సురేశ్, మేరుగ, కైలే అనిల్ కుమార్
సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి కాళ్లకు డాక్టర్ గురుమూర్తి మసాజ్ చేస్తున్నట్టు టీడీపీ అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్టు పెట్టారని, ఆ పోస్టును వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు, లోకేశ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు.