మాస్కులు పెట్టుకునే అవసరం లేదు.. పెట్టుకుంటే బ్యూటీ పార్లర్‌కు ఎలా వెళ్లగలం?: బీజేపీ నేత హిమంత్
- ప్రజలు మాస్కులు పెట్టుకుని భయాలను పెంచుతున్నారు
- మాస్కులు ఎప్పుడు పెట్టుకోవాలో మేము తెలియజేస్తాం
- ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాల్సి ఉంది
- కరోనా సోకిందని అనుమానం వస్తేనే మాస్కు పెట్టుకోవాలి
ప్రజలు మాస్కులు పెట్టుకుని భయాలను పెంచుతున్నారని ఆయన ఓ ఇంటర్వ్యూలో అన్నారు. తమ రాష్ట్రంలో ఇప్పుడు మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ప్రజలు మాస్క్ లు ఎప్పుడు పెట్టుకోవాలో తాము తెలియజేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాల్సి ఉందని తెలిపారు. మాస్కులు పెట్టుకుంటే బ్యూటీ పార్లర్‌కు ఎలా వెళ్లగలమని ఆయన ప్రశ్నించడం గమనార్హం. ఒకవేళ ఎవరికైనా కరోనా సోకిందని అనుమానం వస్తే అప్పుడే వారు మాస్కు పెట్టుకోవాలని ఆయన సూచించారు.