ఆ మంత్రులు టీవీల్లో కనపడుతుంటే ప్రజలు చీదరించుకుంటున్నారు: దేవినేని ఉమ
- రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు
- వారి సమస్యలను పట్టించుకోవట్లేదు
- మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు
- పరిపాలన అంటే ఇదేనా?
అసమర్థ ప్రభుత్వం వల్ల రైతులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని, వారి కన్నీళ్లు సీఎం జగన్‌కు కనిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా బూతులు మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
ఆ మంత్రులు టీవీల్లో కనపడుతుంటే ప్రజలు చీదరించుకుంటున్నారని ఆయన అన్నారు. పరిపాలన అంటే ఇదేనా? అని నిలదీశారు. రైతుల నుంచి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.