కరోనా కేసులు పెరుగుతున్న వేళ... తిరుపతిలో తగ్గిన భక్తుల రద్దీ!
- నిన్న 45 వేల మందికి దర్శనం
- హుండీ ఆదాయం రూ.2.50 కోట్ల
- ఏప్రిల్ లో తిరుమలలో పలు వేడుకలు
నిన్న స్వామివారిని దాదాపు 45 వేల మంది దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 2.50 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ లో తిరుమలలో జరిగే అన్ని ఉత్సవాలకూ ఏర్పాట్లు చేశామని, ఉగాదికి ముందు అణివార ఆస్థానం, ఉగాది, ఆపై శ్రీరామనవమి తదితర వేడుకలకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.