నేపాల్‌కు లక్ష డోసుల టీకాను అందించిన భారత్
- టీకాలిచ్చి ఇతర దేశాలను ఆదుకొంటున్న భారత్
- ఇప్పటికే అనేక దేశాలకు చేరిన ఉచిత టీకాలు
- తాజాగా నేపాల్ ఆర్మీకి డోసుల్ని అందజేసిన భారత ఆర్మీ
- నేపాల్‌కు 8 లక్షల టీకాలను అందించనున్న చైనా
త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ఆర్మీ అధికారులు వీటిని నేపాల్ సైనికాధికారులకు అందజేశారు. ఈ మేరకు భారత దౌత్యకార్యాలయం సోమవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అంతకుముందు నేపాల్ ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం భారత ప్రభుత్వం ఆ దేశానికి పది లక్షల స్వదేశీ వ్యాక్సిన్లను పంపించిన విషయం తెలిసిందే.
మరోపక్క, నేపాల్ కు 8 లక్షల టీకా డోసులను ఇవ్వనున్నట్లు చైనా కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా నేడు 5 లక్షల డోసులను ఆ దేశానికి పంపించింది. నేపాల్‌లో ఇప్పటివరకు 2.7 లక్షల మందికి కరోనా వైరస్ సోకగా.. 3,027 మంది ప్రాణాలు కోల్పోయారు.