ఆ యువనేతతో జాగ్రత్తగా ఉండండి... లేదంటే ముంచేస్తారు: రాజ్‌నాథ్ సింగ్
- కేరళలో ప్రచారం నిర్వహించిన రక్షణ మంత్రి
- రాహుల్ గాంధీపై సెటైర్లు
- గతంలో ఎంపీగా ఉన్న అమేథీ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శ
- వయనాడ్‌నూ ముంచేస్తారని ఎద్దేవా
అమేథీ ప్రజలకు ఆ యువనేత గురించి బాగా తెలుసని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. వారిని అడిగితే ఆయన గురించి చెబుతారన్నారు. గతంలో ఆయన ఆ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారని.. ఇంకా ఆ ప్రాంతం వెనుకబడే ఉందన్నారు. ఇప్పుడు వయనాడ్‌ను ముంచేందుకు ఇక్కడికి వచ్చారని ఆరోపించారు.
కేరళలోని అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం, సీఎం విజయన్‌పైనా రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఒక్కటేనని, ఆ కూటముల నుంచి కేరళ విముక్తి పొందాలని అన్నారు.
మరోవైపు, వాతావరణం అనుకూలించక ఆయన ప్రయాణించిన విమానం ఆలస్యంగా ల్యాండ్ కావడంతో ఎర్నాకుళంలో బీజేపీ తలపెట్టిన రోడ్ షోను రద్దు చేశారు.