Ants: బంగారు గొలుసును లాక్కెళ్లిన చీమలు.... వీడియో వైరల్

  • ఆసక్తికర వీడియో పోస్టు చేసిన చత్తీస్ గఢ్ ఐపీఎస్ అధికారి
  • బంగారం స్మగ్లర్లు అంటూ అధికారి చమత్కారం
  • వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
Ants pulls gold chain

చీమలు సమష్టితత్వానికి, శ్రమైక జీవనానికి ప్రతీకలు అని చెప్పుకుంటాం. అలాంటి చీమలు ఓ తమాషా పనిచేశాయి. కిందపడిన ఓ బంగారు గొలుసును ఎంచక్కా లాక్కెళ్లాయి. సాధారణంగా ఆహారాన్ని చీమలు ఎంతో భద్రంగా తీసుకెళుతుంటాయి. మరి ఈ బంగారు గొలుసును ఎందుకు లాక్కెళ్లాయో తెలియదు కానీ, దీనికి సంబంధించిన వీడియో మాత్రం వైరల్ అవుతోంది. చత్తీస్ గఢ్ ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అతి చిన్న బంగారం స్మగ్లర్లు అంటూ ఆయన చమత్కరించారు. ఇక చీమల ఘనతర కార్యాన్ని వీడియోలో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

More Telugu News