భూములు ఇవ్వకపోతే ప్రభుత్వం లాగేసుకుంటుందని రైతులను బెదిరించారు: ఆళ్ల రామకృష్ణారెడ్డి
- అసైన్డ్ భూముల అంశంలో సీఐడీకి ఫిర్యాదు చేసిన ఆళ్ల
- ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని పునరుద్ఘాటన
- భూములు చౌకగా కొట్టేశారని ఆరోపణ
- ఓ వర్గం మీడియా అసత్య ప్రచారం చేస్తోందని విమర్శ
- విచారణలో అన్నీ బయటికొస్తాయని స్పష్టీకరణ
ఆఖరికి లంక భూములను సైతం కాజేశారని, అప్పటి అధికారులపై ఒత్తిడి తెచ్చి భూముల రిజిస్ట్రేషన్ చేయించారని వివరించారు. రైతుల స్టేట్ మెంట్లను సీఐడీ అధికారులు ఇప్పటికే రికార్డు చేశారని వెల్లడించారు. అమరావతి భూములపై ఓ వర్గం మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అయితే సీఐడీ విచారణలో వాస్తవాలన్నీ బయటికి వస్తాయని అన్నారు.