ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి... పీఆర్సీపై లీకులు ఇచ్చారు: బీజేపీ నేత రాంచందర్ రావు
- తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎన్నికలు
- ఓటమిపాలైన రాంచందర్ రావు
- ఎన్నికల ప్రధాన అధికారితో భేటీ
- టీఆర్ఎస్ పార్టీపై ఫిర్యాదు
- ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణ
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, పీఆర్సీపై ముందే లీకులు ఇవ్వడం ద్వారా అధికారపక్షం ఉద్యోగులతో ఓట్లు వేయించుకుందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు చేతులు మారాయని అన్నారు. గూగుల్ పే, పేటీఎం యాప్ ల సాయంతో ఓటర్లకు నగదు పంపిణీ చేశారని వెల్లడించారు. నకిలీ సర్టిఫికెట్లతో ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయించారని తెలిపారు.