వాణీదేవి గెలుపు సంబరాల్లో అపశ్రుతి... అగ్నికీలల్లో తెలంగాణ భవన్
Add ap7am to your home Screen

వాణీదేవి గెలుపు సంబరాల్లో అపశ్రుతి... అగ్నికీలల్లో తెలంగాణ భవన్

Fire broaken in Telangana Bhavan during winning celebrations of TRS MLC candidate Vani Devi
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి విజయం
  • తెలంగాణ భవన్ లో సంబరాలు
  • బాణసంచా కాల్చుతుండగా ప్రమాదం
  • హుటాహుటీన స్పందించిన అగ్నిమాపక సిబ్బంది 
పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి గెలుపు సంబరాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాదు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శ్రేణులు బాణసంచా కాల్చుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మంటలు భారీ ఎత్తున చెలరేగాయి. తెలంగాణ భవన్ లో ఓ అంతస్తు దగ్ధవుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన తెలంగాణ భవన్ వద్దకు చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. కార్యకర్తల అత్యుత్సాహమే ఈ ప్రమాదానికి దారితీసిందని భావిస్తున్నారు.

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణీదేవి తన సమీప ప్రత్యర్థి రాంచందర్ రావుపై నెగ్గారు. ఆమె హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో విజయకేతనం ఎగురవేశారు.
Telangana Bhavan
Fire Accident
Vani Devi
TRS
MLC

More Telugu News