Trains: ట్రాక్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లు పాక్షికంగా రద్దు
రైల్వే ట్రాక్ మరమ్మతులు, ఇతర నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రెండ్రోజులు పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 19, 20 తేదీల్లో ట్రాక్ మరమ్మతులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్-తాంబరం (రైలు నెంబరు 02760) రైలు చెన్నై ఎగ్మోర్-తాంబరం మధ్య... కాచిగూడ-చెంగల్ (నెంబరు 07652) రైలును, 07644 నెంబరు కలిగిన కాకినాడ పోర్టు-చెంగల్ రైలును చెంగల్పట్టు-చెన్నై ఎగ్మోర్ మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఈ మేరకు చేసిన మార్పులను ప్రయాణికులు గమనించాలని కోరారు.