సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని ఓ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు కరోనా
- తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
- ఓ ప్రభుత్వ బాలుర పాఠశాలలో కరోనా కలకలం
- 84 మందికి రాపిడ్ యాంటీజెన్ కరోనా పరీక్షలు
- కరోనా పాజిటివ్ విద్యార్థులను స్వస్థలాలకు తరలింపు
కంటోన్మెంట్ ఏరియాలో స్కూళ్లు పునఃప్రారంభమైన తర్వాత విద్యార్థులు కరోనా బారినపడడం ఇదే తొలిసారి. కొందరు బాలురు అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఈ పాఠశాలలో 84 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ముగ్గురు కరోనాతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. దాంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారిని వారి స్వస్థలాలకు పంపించారు.