ఈ సంస్థకు నిధులెక్కడి నుంచి వస్తున్నాయి?: బండి సంజయ్ ఆగ్రహం
- సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తున్నారు
- స్వేరోస్ సంస్థపై వెంటనే చర్య తీసుకోవాలి
- హిందూ మనోభావాలను దెబ్బతీసే కుట్ర
- సీఎం కేసీఆర్ ప్రోద్బలంతోనే ఇలాంటి చర్యలు
'సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తున్న స్వేరోస్ సంస్థపై వెంటనే చర్య తీసుకోవాలి. సీఎం కేసీఆర్ ప్రోద్బలంతోనే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ కుట్ర జరుగుతోంది. ఈ సంస్థకు నిధులెక్కడి నుంచి వస్తున్నాయి? మీరు లెక్కలు తీస్తారా? కేంద్రానికి ఫిర్యాదు చేసి అక్కడి నుంచి తీయించమంటారా?' అని సంజయ్ ట్వీట్ చేశారు.
'హిందువులను కించపరిచే కార్యక్రమాలు జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏమి చేస్తోంది? చాలా ఏళ్లనుంచి ఈ కుట్ర జరుగుతోంది. హిందూ వ్యతిరేకులను ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ తన విధిగా చేసుకున్నారు' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పటికీ సీఎం మౌనం వహించడం ఆయన పతనానికి నాంది కాబోతోంది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాము' అని బండి సంజయ్ హెచ్చరించారు.