ఆ వీడియోను ఆయనే విడుదల చేశారు.. మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి సెక్స్ సీడీ కేసులో బాధిత యువతి
- 11 రోజుల తర్వాత అజ్ఞాతం నుంచే వీడియో విడుదల
- వీడియోను ఎవరు చిత్రీకరించారో తనకు తెలియదని వివరణ
- రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరిన బాధిత యువతి
రమేశ్ జార్కిహోళి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించాడని ఆరోపించిన బాధిత యువతి.. తనకు రక్షణ కల్పించాల్సిందిగా రాష్ట్ర హోం మంత్రి బసవరాజు బొమ్మైని కోరింది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా, బాధిత యువతి అజ్ఞాతం నుంచే వీడియో విడుదల చేయడంతో ఆమె ఆచూకీ కనుగొనడం పోలీసులకు కష్టంగా మారింది. మరోవైపు, ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసేందుకు కొందరు నకిలీ సీడీ సృష్టించి మానసికంగా హింసించారని, దీని వెనక ఉన్న ప్రతి ఒక్కరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.