వైసీపీ నేత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డిపై దాడి
- గుంటూరు జేకేసీ కాలేజీ వద్ద మోదుగులపై దాడి
- ఆయన వాహనంపై రాళ్లు రువ్విన వైనం
- దాడిలో ధ్వంసమైన రెండు కార్లు
మోదుగుల కారులో ఉన్న సమయంలోనే ఆయన కారుతో పాటు, ఆయనతో పాటు వచ్చిన మరో కారును ధ్వంసం చేశారు. రెండు కార్లపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కార్ల అద్దాలు పగిలిపోయాయి. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతంలోనే ఉన్న జిల్లా ఎస్పీ ఘటనా స్థలికి హుటాహుటిన చేరుకున్నారు. అక్కడున్న వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మరోవైపు, ఈ దాడిలో మోదుగులకు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. పోలీసులు ఆయనను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు. ప్రస్తుతం జేకేసీ కాలేజీ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.