అమిత్ షా తన ఆరోపణలను నిరూపించాలి.. లేకపోతే కేసు వేస్తా: మాజీ సీఎం నారాయణస్వామి డిమాండ్
- నారాయణస్వామిపై అమిత్ షా అవినీతి ఆరోపణలు
- తన ప్రతిష్ట దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారన్న మాజీ సీఎం
- పుదుచ్చేరి ప్రజలకు క్షమాపణ చెప్పాలని వ్యాఖ్య
అమిత్ చేసిన వ్యాఖ్యలను తాను సవాల్ చేస్తున్నానని నారాయణస్వామి చెప్పారు. తనపై చేసిన ఆరోపణలను ఆయన తక్షణమే నిరూపించాలని అన్నారు. ఆరోపణలను నిరూపించలేకపోతే పుదుచ్చేరి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీ కుటుంబ ప్రతిష్టను, తన ప్రతిష్టను నాశనం చేసేలా వ్యాఖ్యానించిన అమిత్ షాపై పరువునష్టం దావా వేస్తానని చెప్పారు.