తిరుపతి పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం
- ఈ నెల 4,5 తేదీల్లో సమావేశం
- తిరుపతి రాబోవడంలేదన్న అమిత్ షా
- దేశంలో పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు
కాగా, దేశంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో, ఆయా రాష్ట్రాల్లో ప్రచారం సాగించేందుకు వీలుగా అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నట్టు భావిస్తున్నారు. ముఖ్యంగా, 8 విడతల్లో పోలింగ్ జరుపుకోనున్న పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దాంతో, అమిత్ షా అధిక సమయం పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై దృష్టి సారించేందుకు ఈ పర్యటనకు రాబోవడంలేదని తెలుస్తోంది.