వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు.. 34 రోజుల్లో కోటి మందికిపైగా టీకా!
- గత నెల 16న మొదలైన వ్యాక్సినేషన్ డ్రైవ్
- వేగంగా టీకాలు వేస్తున్న దేశాలలో రెండోస్థానం
- మూడో స్థానంలో బ్రిటన్
వ్యాక్సినేషన్ విషయంలో మనకంటే ముందు అమెరికా ఉంది. ఆ దేశం 31 రోజుల్లోనే కోటిమందికి టీకా వేసింది. అత్యంత వేగంగా టీకా వేస్తున్న జాబితాలో అమెరికా తర్వాతి స్థానం మనదేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా, భారత్ తర్వాతి స్థానంలో బ్రిటన్ ఉంది. ఆ దేశం 56 రోజుల్లో కోటిమందికి టీకాలు వేసింది.