Bandi Sanjay: న్యాయ‌వాదుల హ‌త్య కేసులో నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేసి చేతులు దులుపు‌కోవ‌ద్దు: బ‌ండి సంజ‌య్

bandi sanjay slams trs government
షార్ట్స్‌లో చూడండి
హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు, నాగమణి  దంపతులను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద కొంద‌రు దారుణంగా హత్య చేసిన ఘ‌ట‌న సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వామనరావు తల్లిదండ్రులను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆ పార్టీ నేత‌లు ప‌లువురు పరామర్శించారు.

ఈ సంద‌ర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ‌ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇది ప్రభుత్వ హత్యేనని ఆయ‌న‌ ఆరోపించారు. పథకం ప్రకారమే  న్యాయ‌వాద‌ దంపతులను చంపేశార‌ని,  ఈ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారని ఆయ‌న హెచ్చ‌రించారు.

పూర్తి విచార‌ణ‌‌ పూర్తయిన అనంత‌ర‌మే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ హత్యల‌ వెనుక ఎవరున్నారన్న విష‌యం తెలిసిన అనంత‌ర‌మే చర్యలు తీసుకోవాల‌ని చెప్పారు.  ఈ హ‌త్యల‌ ఘ‌ట‌న‌పై వెంటనే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ స్పందించాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. టీఆర్ఎస్ నేతలు దీనిపై ఎందుకు స్పందించడం లేదని నిల‌దీశారు.
Go Back to Shorts
Bandi Sanjay
BJP
KCR

More Telugu News