టీ20 ర్యాంకింగ్స్ విడుద‌ల చేసిన ఐసీసీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీ20 ర్యాంకింగ్స్ విడుద‌ల చేసిన ఐసీసీ!

icc t20 rankings releases
  • అగ్ర‌స్థానంలో ఇంగ్లండ్‌
  • బ్యాట్స్‌మెన్‌ లో కేఎల్‌ రాహుల్‌ రెండో స్థానం
  • బౌలర్లలో ఆఫ్ఘన్ ఆట‌గాడు రషీద్‌ ఖాన్ నం.1
ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుద‌ల చేసింది. ఇందులో ఇంగ్లండ్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా ఆస్ట్రేలియా, భార‌త్ ఉన్నాయి. టీ20 బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో భార‌త బ్యాట్స్‌మ‌న్‌ కేఎల్‌ రాహుల్‌ ఒక స్థానం ఎగ‌బాకి, రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆయ‌న‌‌ ఖాతాలో 816 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి.

ఈ జాబితాలో ఇంగ్లండ్‌ క్రికెటర్‌ డేవిడ్‌ మలాన్ ( 915 రేటింగ్‌ పాయింట్లు) అగ్ర‌స్థానంలో కొనసాగుతుండ‌గా, విరాట్ కోహ్లీ ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘన్ ఆట‌గాడు రషీద్‌ ఖాన్ (736 పాయింట్లు) అగ్ర‌స్థానంలో ఉండ‌గా, సౌతాఫ్రికా ఆట‌గాడు షమ్సీ (733 రేటింగ్‌ పాయింట్లు) రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు.
icc
Cricket
kl rahul
Virat Kohli

More Telugu News