కర్నూలు జిల్లా ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
- వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద టెంపో, లారీ ఢీ
- 14 మంది దుర్మరణం
- ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్
- క్షతగాత్రులకు రూ.1 లక్ష సాయం అందించాలని నిర్ణయం
కాగా, ప్రమాద ఘటనపై కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ స్పందించారు. టెంపో వాహనం డ్రైవరు నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై సీఎం జగన్ తక్షణమే స్పందించి అధికారులను సంఘటన స్థలానికి పంపాలని ఆదేశించారని కలెక్టర్ వివరించారు. ప్రమాద కారణాలను మరింత లోతుగా తెలుసుకునేందుకు సాంకేతిక బృందం సాయం తీసుకుంటున్నామని తెలిపారు.